STORYMIRROR

Challa Sri Gouri

Abstract Classics Others

4  

Challa Sri Gouri

Abstract Classics Others

మధురానుభూతులు

మధురానుభూతులు

1 min
344

ప్రతిరోజు ఉల్లాసంతో నిండిన వదనం

సాయంత్రపు ఆనందాలకు నిలయంగా మారిన భవనం

నానమ్మ కథలకై వేచి చూసే హృదయం

తాతయ్యతో విహారానికై తపించే తరుణం

గురువుగారి ప్రశంసలకై పోటీ పడిన క్షణం

హద్దులు లేని సంతోషాల సమ్మేళనం

ఈర్ష, అసూయలకు దూరం

కోపతాపాలకు చెల్లని కాలం

సమైక్యతకు పోరాడిన మనం

సంబరాల వెల్లువలు అనుక్షణం

మళ్లీ రాదు ఆ నిమిషం

ప్రతి ఒక్కరికి ఆనందాలు పంచే బాల్యం



Rate this content
Log in

Similar telugu poem from Abstract