మధుర స్వప్నం
మధుర స్వప్నం
ఆమె అతడిని చేరాలని చేసిన తపస్సు ఫలించిన రోజు
అతడు ఆమెని చేపట్టాలని చేసిన ప్రయత్నాలు నెరవేరిన రోజు
అది వారి పెళ్లి రోజు
రెండు కుటుంబాలు ఒకటిగా కలిసి వారిని దీవించిన రోజు
శాస్త్రోక్తంగా వారిరువురిని ఏడు జన్మల బంధంగా కలిపే రోజు
వారి ప్రేమ హిందూ వివాహ బంధానికి కొత్త వన్నెలద్దేందుకు సిద్ధమైన రోజు
అతడి విశాలమైన ఛాతీపైన ఆమె నిదురించే రాత్రిని తెచ్చే రోజు
దంత క్షతాలు కానుకగా ఆమె అందుకునే రోజు
రెండు ఆత్మలు ఒక్కటిగా సంగమించే రోజు
అది వారి పెళ్లి జరిగే రోజు