మార్కెట్
మార్కెట్




స్వతహాగా మార్కెట్లో
పారిశుధ్యం తక్కువే
ఎక్కడెళ్ళి చూసినా
ఎప్పుడెళ్ళి చూసినా
పరిశుభ్రత తక్కువే
అన్నదే నిజమంట..
ఈ సమయం సరైనదే
మార్కెటును శుభ్రపరచి
పరిసరాల ప్రాంతాలకు
శుభ్రతను విస్తరించి
రాబోయే రోజులలో
ఆదర్శ మార్కెట్ గా
గుర్తింపు తేవాలని
పరితపిస్తున్న అధికారుల
కండగా నిలుద్దాం...
మార్కెట్ కమిటీ వారు
విధి విధానాలు నిర్ణయించి
అక్కడున్న వారిచేత
ఆచరణకు తీసుకొస్తే
ఆరోగ్యం మహాభాగ్యం
అందరికి మార్గదర్శం...