మామ్మగారి ఉద్యానవనం
మామ్మగారి ఉద్యానవనం
మామ్మగారి ఉద్యానవనం
ఎంతో అపూర్వం ఆహ్లాదకరంగా ఉంది మామ్మగారి ఉద్యానవనం,
ఎంతో శస్య శ్యామలంగా ఉంది ఈ నయనానందకర నందనవనం,
వివిధ విహంగములు గగనం నుండి చేస్తాయి ఇచ్చటకు ఆగమనం,
అందమైన సుమలత ఫలవృక్షాలు చేశాయి తోటకు శోభాయమానం ।౧।
పూసిన పుష్పములు వెదజల్లాయి పరిపూర్ణ పరిమళం,
రంగురంగుల సీతాకోకచిలుకలు వేస్తున్నాయి తాళం,
ఘోషతో తుమ్మెదలు చేస్తున్నాయి సన్నాయి మేళం,
కోమ్మమీద కోయిలలు అనర్గళంగా ఇప్పాయి గళం ।౨।
ఈ నందనాకి బామ్మగారిచ్చారు తన ఇచ్ఛాశక్తి,
ప్రతి మొలక మొక్క తీగ పై చూపారు అనురక్తి,
ఫలవృక్షాల ఎదుగుదలపై చూపించారు ఆసక్తి,
పచ్చనైన ప్రకృతిపై మామ్మగారు నేర్పారు భక్తి ।౩।