STORYMIRROR

Rajagopalan V.T

Drama

4  

Rajagopalan V.T

Drama

మా ఆవిడే

మా ఆవిడే

1 min
22.7K

మంచికి మారుపేరు         

మా ఆవిడెనేనండీ 

మాటలు కఱకు గున్నా 

మనసు మాత్రం వెన్నండి.. 


ఆప్యాయతకు మారుపేరు 

ఆదరింపుకేమో థెరిసా

అర్థం చేసుకుంటే మాత్రం  

అడుగడుగునా ఆనందం. 


వంటలకే రాణి ఆమె 

ఆకలేస్తే అన్నపూర్ణ 

పస్తులన్న పట్టదాయె 

కడుపుకంత పెట్టునాయే.. 


అందరితో కలివిడిగా 

ఆదరిస్తూ ఉంటారండి 

పెద్ద చిన్న తేడా లేక 

ప్రేమను కురిపిస్తారండి..  


పిల్లలంటే ప్రాణమిచ్చు 

స్నేహానికి విలువ నిస్తూ 

బంధువులతో అనుబంధం 

చెప్పనలవి కాదండి.. 


మనసులోన బాధలన్నీ 

ఒక్క క్షణం వ్యక్తపరచి 

మరునిమిషం మర్చిపోయి 

మర్యాదలు చేస్తారండి..


Rate this content
Log in

Similar telugu poem from Drama