లవ్ U డాడ్!
లవ్ U డాడ్!
వెన్నెల కోరుకుంటాం..
వెన్నెల్లో ఆడుకుంటాం..
వెన్నెల వెలుగులో..
వేతలెన్నో...మర్చిపోతాం!
కానీ!
ఆ వెన్నెలని ఇచ్చే..
చంద్రుడ్ని మాత్రం..
అరదు గా...తలచుకుంటాం!
నా దృష్టిలో..
మన సృష్టిలో..
వెన్నల అమ్మ అయితే
చంద్రుడు...నాన్న!
మనకు వెలుగునిచ్చేందుకు..
యెన్నో..
చీకటి రాత్రులను గడుపుతూ
అమావాస్యను సైతం..
తట్టుకుంటూ..
దాటుకుంటూ..
వస్తాడు..నాన్న!
ఓ..నాన్న!
నా జన్మకి..మూలం..నీవు
నా నడకకు నాంది నీవు
నా విద్యకు ఆద్యం నీవు
నా నడతకు మార్గం నీవు
నా బ్రతుకు కి రూపం..నీవు
ఓ..నాన్న!
నువ్వే గానీ లేకుంటే..
నా బ్రతుకెపుడో అయ్యేది...
గుండు సున్నా!
......రాజ్....
