లక్షల కోట్లు
లక్షల కోట్లు


కోవిడ్ 19 వచ్చింది
లక్షల కోట్లు తెచ్చింది
లక్ష్యం కోసం తయారయ్యి
మన గుమ్మం వాకిట కొస్తుంది.
మోడీ గారి ఆర్ధిక ప్యాకేజీ
అర్థం కాదులే కొందరికీ
ఆశలకేమో అంతే ఉండదు
ఇంకా చాలదు అంటుంది..
మధ్య తరగతి ప్రజలకేమో
మైకం వచ్చేటట్లుంది
కంటి మీద కునుకు లేక
పునరుజ్జీవనానికి చూస్తుంది.
ఆశలతోటే బతుకు బండిని
ఆటుపోట్లతో లాగిస్తున్నాం
గమ్యం చేరాలంటే మాత్రం
అగమ్య గోచరం కానొస్తుంది.