STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

లారీ డ్రైవర్..

లారీ డ్రైవర్..

1 min
163

తల్లి కడుపు కోయించి..

తెగించి..బయటకొచ్చి!


పడుతూ లేస్తూ..

పరుగెడుతూ...

సాహసించి!

బండెడు పుస్తకాలును

భుజాన వేసుకొని బడికొచ్చి


బర్రకెక్కని చదువులతో చిరాకొచ్చి

మనకెక్కవీ అచ్చరాలు అని లాగించి


లారీ ఎక్కి తొక్కి..

కొట్టర్ బిగించి

రయ్ రయ్ మని తోలుతూ..

గోతులు గాతలు తప్పించి

బతికి బయటపడి


కాళ్ళ పారాణి అయినా ఆరని

కొత్త జంటపై బండి నడిపించి

బాధపడుతూనే బయటపడాలి..

అని ఆలోచించి


ఓ లంచగొండిని ఆశ్రయించి..

చేతులు తడిపి బయటకొచ్చి

తిరిగి అదే లారీని...

ఇసుక లోడ్ 

ఏసుకొని రోడ్ పైకెక్కించి..


నిద్ర మత్తులో..నిడదోలు రోడ్ లో..

రయ్ రయ్ మని పోనిచ్చి..

మళ్లీ..మరొకరిని తొక్కించ!


దెబ్బకు..

మత్తులోంచి బయటకొచ్చా

నా ఎదురుగా

తెగిపడిన తనువు శకలాలు

ఏరు లా పారుతున్న రక్త ధారలు

గుండెను పిండేసే ఆర్త నాదాలు

అంతలోనే..ఆవరించిన నిశ్శబ్ధం!


అనంత లోకాలకు పయనమైన

ఆ..అభాగ్య జీవిని చూసి..

నా మత్తు వదిలిన మెదడుకి

పిచ్చి పట్టింది!


ఛీ!

నా జీవితం ఇన్ని జీవితాలను

నాశనం చేసిందా అని చింతించి

గుండె కరిగి...

రగిలిరగిలి.. ఆవిరై ఆగిపోయింది!


ఓరన్న..

చేసిన తప్పులే..

మళ్లీ మళ్లీ చేయకుండ్రి..

అయిన వాళ్ళకి.. కాని వాళ్ళకి

కన్నీరు మిగల్చకుండ్రి!


      .....రాజ్....



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Tragedy