కవితాక్షరం
కవితాక్షరం
అక్షరం నేస్తమే కాదు
మది మోయలేని భావాలు
గుండె లోతుల్లో
చెలరేగిన లావాలు !
బల్లున పేలిపోయే
ఆవేశానికో ,ఆక్రందనో
అనుభవసారనికో....
అక్షరమై వెల్లివిరుస్తుంది
మనసును తేలిక పరుస్తుంది!
ఆ అక్షరాలలోని గుబాళింపు
ఆకలింపు చేసుకుంటేనో
అనుభవాల చెట్టుకు
కాసిన కాయలు రుచి చూస్తేనో
తెలిసోస్తుంది!
వాన నేలను తడిపినట్టు
అక్షరం సమాజాన్ని అమాంతం మార్చకపోవచ్చు
అక్షరంలోని భావాలు
మంచులా ప్రతి మదిని కరిగించలేకపోవచ్చు
కానీ జోరీగై మెలిపెడుతుంది
ఆలోచన రేకెత్తిస్తుంది
అక్షరం ప్రభంజనమై కదిలి వస్తుంది
పెను మార్పు సృష్టిస్తుంది
సూన్యంలో మిగిలిన కొన్ని సత్యాలకు ఆత్మగా
రేపటికి ఆశగా ఉదయిస్తుంది!!
-జ్యోతి మువ్వల
