STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

కవితా గేయం

కవితా గేయం

1 min
264

మున్షీ జననం : భా . వి . భా . మార్గ దర్శనం 

కవితా గీతం/ గేయం : కవీశ్వర్ 

కె.ఎం . మున్షి గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని :

ఈ రచన : 17.12. 2021 . 

పల్లవి : కదిలిందీ కదిలిందీ ఉద్యమ కెరటం కదిలింది 

 చేయూత నిచ్చింది మార్గ దర్శనం 

 కులపతి కలయే నిజమైన సాధనం || కదిలిందీ ||

 జీవన రసమయ కర్మ సాధనం కదిలింది || కదిలిందీ ||


చరణం: 1 : రాజ్యాంగ ప్రణాళిక సహయోజన కలిగించే 

 రాజ్య విలీన క్రియలో ఉక్కుమనికి చేయూత 

 కేంద్ర మంత్రా0గం లో ఖాద్య శాఖనెరిపేనే

 వనమహోత్సవ కీలకోద్యమ హరితభారతి నెంచెనే  

                                            || కదిలిందీ ||


చరణం : 2 : మనముల తలపులు పలు దెసల కలగలుపే 

 సాంస్కృతిక కళామ తల్లికి సకల సేవలు చేసెనే 

 రచనా కౌశలా విద్యా లక్ష్మిని విశ్వ వ్యాప్తి గావించెనే 

 గతమునుంచి వర్ధమానమున భవిష్య దర్శనం చేసెనే 

                                             || కదిలిందీ ||


చరణం : 3 : వసుధైక కుటుంబరీతి భా.వి.భా .ను నెలకొల్పె 

 దీని సేవలకు ప్రభుత చేయూత సల్పవలె నే 

 యువత ఉజ్వల భవిత కు కుసుమ మార్గము చూపవలెలే 

 నిరంతర సేవలచే సంస్థ సమాజ హితముకు పాటు పడెలే 

                                              || కదిలిందీ ||


Rate this content
Log in

Similar telugu poem from Abstract