STORYMIRROR

T. s.

Classics Inspirational

4  

T. s.

Classics Inspirational

కవిత

కవిత

1 min
3.5K

కవిత అంటే...

విప్లవ కవిత అయితే ఆవేశంతో పిడికిలి బిగియాలి

విషాదం - మనసులో చెమ్మ తగిలి కన్నుల్లో తడి చేరాలి

ప్రేమ - ప్రేమించి, ప్రేమను పెంచి, పంచాలనిపించాలి


మొత్తానికి...

కనులను తడిపి

గుండెని తడిమి

మనసును కదిలించి

ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా...

ఓ భావ ప్రభంజనంలా...

కలలా వచ్చి... కదలికలు నేర్పి...

కలవరపరిచి...కాలంలో కాగితంలా కనుమరుగవక...


అక్షరాలన్ని పదాల అల్లికలుగా మాల కట్టుకోవాలి.

ఆవేశంగా ఆకాశం అందుకోగలగాలి.

ఇంద్రధనుస్సుపై ఊయలూగాలి.

వేల తారకలన్నీ సిరా చుక్కలై వెలుగునివ్వాలి.

మనసులో చెలరేగిన భావాలన్ని విహంగాలై నింగికెగయాలి..



Rate this content
Log in

Similar telugu poem from Classics