కుటుంబం ఆఫ్లైన్ లో..
కుటుంబం ఆఫ్లైన్ లో..
ఆఫ్లైన్లో కుటుంబం
అన్లైల్నో మన మనసు
ఏదో దాచేద్దాం అని కొందరు
ఉన్న ఎమోషన్స్ చాలవని
ఆన్లైన్ స్నేహితుల కోసం ఎదురు చూడడం
ఎత్తిన తల దించకుండా
అన్ని దేశాల విషయాలూ చూసేస్తాం
బర బరా వేళ్ళతో స్క్రీన్ పై గీసేస్తాం
అరే
మన కుటుంబం ఎలా ఉంది
ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలిసినా
ఆత్మీయ స్పర్శ లేకుండా
ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో
అప్డేట్స్ చూసుకుంటూ
గడిపేద్దామా
ఏం చిన్నా యెట్లుండావ్
మామా ఏం జేస్తాండవ్
అవ్వా ఆరోగ్యం కులాసానా
ఏదీ ఆత్మీయత కలిగించే పిలుపులు
వినబడవే?
ప్రపంచం మొత్తం ఫోన్లో దొరకవచ్చు
నువ్వే వారి ప్రపంచం అనుకునేవాళ్లు
నువ్వూ వారి ప్రపంచంలో ముఖ్యం అనుకునే వాళ్ళు
ఆన్లైన్లో లేకపోయినా
కాస్త పలకరించండి
ప్రేమగా కబుర్లు చెప్పండి
ఆత్మీయ ఆలింగన అనుభూతి
వాట్సాప్ ఎమోజీకి పరిమితం చేయకండి
