STORYMIRROR

Nannam Lokesh

Abstract Inspirational

4  

Nannam Lokesh

Abstract Inspirational

కఠినమైన మనసు ఈ అమ్మాయి

కఠినమైన మనసు ఈ అమ్మాయి

1 min
382

ఓ! నా సఖి

నా మాటల పల్లకిలో నిన్ను మోయలనుకున్నా

చివరకు ని జవాబు, నేను రాను, చేయను

ఆహా! ఏమిటో నీ సౌందర్యం, ఎందుకు ఈ మాటలు

చిలిపి కలిగిన నీ మధురమైన మాటలు

ఎన్నటికిని నేను మరువజాలను సుమా

గుర్తు పెట్టుకో! నీ జీవితంలో 

నేను ఒక బాట సారిని అని


ఏమీ చేయగలను నీతో ఎంత మాట్లాడిన

ఏమి మిగిలెను, నా ఆలోచనలు తప్ప

ఓ! అందాల రాక్షశి, ఏమిటీ నీ వింత

ఎదో చెప్పాలనుకుంట, ఏమి లాభం

నా పనికి మాలిన తనం దానికి కారణం

అసలు ఎందుకు ఈ గొడవ ఆనుకుంటే

ఏమిటో నీ కఠిన మనుసు

ఇంకా అర్థం కాలేక సతమతమవుతున్నా


చివరికి మిగిలిన జ్ఞాపకాలను మాత్రం

నా మనసులో నీకు ఒక చోటు

అర్థం కాకపోయినా నేను ఇంతే

నేను అన్న పదం నాలాంటిది

ఎందుకంటే అది చెప్పలేనంత

విశాలమైన మనసు కలిగివుంది

మాటలకు రంగులు మారవు

కానీ మనసు కరుగుతుందని తెలుసు.



Rate this content
Log in

Similar telugu poem from Abstract