STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

కథగా.. కల్పనగా..

కథగా.. కల్పనగా..

1 min
318

ఏదో వ్రాస్తూ ఉన్నా

శుక్ల పక్ష చంద్రుడిని గది గోడలుగా చేస్తూ

శ్రావణ వ్రత కథల్ని నదిలో నావలుగా చేస్తూ

నీ వలలోంచి బయటికి రావడానికి

శాయశక్తులా కృషి చేస్తున్నా


మదిలో ఆశలు వెచ్చని మంటను రేపుతుంటే

యవ్వనం మళ్లీ ప్రేమలో పడమంటే

పోనీ ప్రేమ పేరుతో తనువును రాసివ్వమంటే

అలసిపోయానని

వయసుకు సర్ది చెబుతున్నా


పోనీలే

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావ్?

అని ఎవరైనా అడిగితే

బీచ్ రోడ్డులో శ్రీశ్రీ విగ్రహంతో కొత్త కవితలు చెబుతూ ఉంటా అని నవ్వేస్తా


మరో ప్రపంచం వచ్చిందో రాలేదో

మాయా ప్రపంచమైతే వచ్చింది

నా బతుకులో మిధ్యను తెచ్చింది

ఒక కథగా కల్పనగా నన్ను మార్చింది



Rate this content
Log in

Similar telugu poem from Abstract