STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

క్షణమెపుడో..

క్షణమెపుడో..

1 min
493

క్షణమేపుడో కరిగిపోయెను గాని!

కన్నుల్లో చెమ్మ మాత్రం..

ఇంకనూ...చెరగలేదు!

నిముసమెపుడో..నీరైపోయేను గాని

నా కలత నిద్ర మాత్రం..

ఇంకనూ...ఇడవలేదు!

దినమెపుడో .. దొరిలిపోయెను గాని

నా దరిద్రమింకనూ.. దారి మరల లేదు

వారములెపుడో.. వెడలిపోయెను గాని!

నా వేదన ఇంకనూ..ఇంకిపోవుట లేదు

మాసములేపుడో..మరలిపోయేను గాని

నా మెదడుకింకనూ..మత్తు వదులుటలేదు

యేటికి యేడు...ఎగిరెల్లిపోతున్నా

నా యదలో మంటకి మాత్రం..మందు లేదు!


మార్పు లేదు..మార్పు లేదు..

ఎలా ఎలా...?


సింగమైనా.. చిట్టెలుకైనా..

సంపన్నుడైనా..సన్నాసైనా..

చేసినపనినే..మళ్లీ మళ్లీ చేసి

చేసిన విధంగా..మళ్లీ మళ్లీ చేసి

మార్పు లేదు..రాలేదు అంటే

దానికన్నా...

అమాయకత్వం లేదు

మూర్ఖత్వం అంతకన్నా లేదు!


         .......రాజ్....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action