STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

క్షణక్షణం

క్షణక్షణం

1 min
372

గుప్పిట పట్టుకున్న ఇసుక రేణువులు జారుతున్నట్లు

ఏదో కంగారు

నడుస్తున్నా

చూస్తున్నా


ఇంకేదో చెయ్యలేదు అనో

ఇంకా చెయ్యలేదు అనో

చెప్పలేని భావాల గుట్ట పెరుగుతోంది అనో


వయసు వెళ్ళిపోతున్న భావన

మరి అది ఇవాల్సిన అనుభవాల్ని ఇస్తోందా అనే శోధన

పరుగెత్తడం ఇష్టం లేక పాలు తాగడం మానాలా

నిలబడే ఓపిక లేకున్నా నీళ్లు తాగకుండా ఉండాలా


గతానికీ భవిష్యత్తుకూ ఒక శతృత్వం కల్పించాలా

ఏమైనా ఇంక చాలా


క్షణక్షణం కలిగే ఎమోషన్

భయమే అనాలనిపిస్తోంది

నాకు నేను దూరమైనా 

దగ్గరున్నట్టు నటించాల్సిన భయం

నా చుట్టూ ఉన్న గొప్ప నటులతో పోటీ భయం


క్షణక్షణం 

భయం భయం

మీకు లేదా భయం

లేక మీకు భయమే లేదా..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract