కరోనా రక్కసి
కరోనా రక్కసి
చేయి చేయి కలిపినా
మాస్కును మరచినా
మనకు మనమే ఇస్తాము ఆహ్వానం
కరోనా రక్కసి కబంధ హస్తాలకు బలిదానం
అడుగు బయటపెట్టే ముందు
కాస్త ఆలోచించు
మాస్కు శానిటైజరు
నీ అక్షయ రక్షణ కవచాలు
అందరికోసం ఒక్కరుగా
విడివిడిగా ఉంటూ
మన ధ్యేయం ఒకటే అంటూ
ముందుకు నడుద్దాం
నరనరాల్ని
వ్యాక్సిన్ తో పాటు ధైర్యాన్ని కూడా నింపుదాం
ఇకనైనా మేలుకుని
ప్రకృతి బాటలో అడుగులు వేద్దాం
పచ్చని ఆకులతో ఆక్సిజన్ ని ఆహ్వానిద్దాం
ఇదే మనం నేర్వాల్సిన చదువు
