STORYMIRROR

# Suryakiran #

Inspirational

4  

# Suryakiran #

Inspirational

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం

1 min
355


కొత్త సంవత్సరం వస్తుంది మళ్ళీమళ్ళీ .


ఎంత అద్భుతమో ,


సూర్యునిచుట్టూ తిరుగుతూ భూమి


మరలమరల మనకోసం


రోజులను , వారాలను సినిమా రీలులా


కళ్ళముందుకు


తీసుకొస్తుంది విశ్వంలో తాను తుళ్ళీతుళ్ళీ !


ఆడుకోమని , పాడుకోమని ప్రోత్సహిస్తూ ,


వాతావరణాన్ని


అందుకు అనుగుణంగా మార్చుతూ .


ప్రకృతిసంపదను ఫలాలుగా అందిస్తూ ,


శక్తి అనే ఇంధనాన్ని అందరికీ


ఎక్కడున్నా పరిపూర్ణంగా ప్రసాదిస్తూ !


మనసులోగిలికి కట్టే ఆశలతోరణాలకు


శుభాకాంక్షలతో రాగా పచ్చదనం ,


పలుకరిస్తూ వరుసగా వచ్చే పండుగలకు


కలిగే ఉత్సాహం మన హృదయాలను


పులకింపజేసే అమూల్యధనం .


ఇచ్చి ప్రతి ఒక్కరికి తమజీవితాల్లో


కొత్తదనాన్ని ఆహ్వానించుకునే అవకాశం ,


అంటుంది సవాళ్ళను విసురుతూ


నాగరికతనిచ్చెన మెట్లెక్కే మనిషికి


హద్దు ఎప్పుడూ ఆకాశమే అని ,


కాలం ఒడిలో ఈనాటి ఊయల తనని ,


ఆనందంగా మున్ముందుకు సాగమనీ !!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational