కొత్త జంట..
కొత్త జంట..
జంట...
సృష్టిలో...జంటగా
ఉండేవి...బహు చిత్రము గా ఉంటాయి
వెలుగు చీకటు లు
పగలు రాత్రు లు
కలిమి లేము లు
సరసం విరసము లు
రాజు పేద లు
మంచి చెడు లు
సుఖ దుఃఖా లు
నింగి నేల లు
తీపి చేదు లు
ఆడ..మగ లు!
జంట గా ఉండే వన్నీ..
ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నవి
అంటే...
సృష్టి ధర్మం చెప్పకనే చెబుతోంది
భిన్నంగా ఉన్న...
స్త్రీ పురుషులు జంట గా
ఎలా ఏర్పడతారో...
అలానే...
జీవితంలో... ఎదురయ్యే
అనుభవాలన్నీ...
కలిసిమెలిసి ఉండే భిన్న ధృవాలు
ఎలా అంటే..
రాత్రి లో ఉన్నపుడు..
రాబోయే ది పగలు అని తెలుసుకో...
పగటి లో ఉన్నపుడు..
రాత్రి కూడా వెంటే ఉంది అని గ్రహించి కో...
అని తెలియ జేసేవే... ఈ..జంటలు
కానీ...
కొత్త జంటలు.. కు
పగలైన రాత్రి అయిన...ఒకటే..
ఆందోళన...ఆశ్చర్యం..
ఆరాటం... ఆత్రం..
ఆకర్షణ....ఆనందం..
అందం...బంధం...
ఆపలేని తమకం...
ఓపలేని..తాపం..
అబ్బబ్బా....
కొత్త జంటలు పడే...తంటాలు...
వర్ణింప....
ఆ కాళిదాసు కలము కైన...
సిరా.... సరిపోవునా.....?
.....రాజ్.....

