కోల్పోయిన బాల్యం
కోల్పోయిన బాల్యం
ఇంకా ఏముందని వెతకాలి
ఆనాటి జ్ఞాపకాలు శరీరం మీద మాసినా
మనసులో ఇంకా పచ్చిగా ఉన్నాయి
ప్లాస్టిక్ మొక్కలకు నీళ్లు చల్లినట్లు
నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోవడం
నా బాల్యంలో నన్ను వెతుక్కొమ్మనే సలహా ఇవ్వడం
వాహ్
చాలా బాగుంది
కన్నీళ్లకు వెల కట్టి వేళాకోళం చేసే నువ్వు
కోల్పోయిన బాల్యాన్ని అర్థం చేసుకోగలవు అని అనుకోవడం
అందుకై నేను ప్రయత్నించడం
ఓ గొప్ప విషయం
ఇహ నాకు ఓపిక లేదు
నిన్నటి మధుర స్మృతుల మరువాలను మంటల్లో కాలుస్తూ
ఆ సెగల్లో చలి కాచుకుంటున్న నీ దళసరి చర్మానికి
ఇక ముద్దులు నేనివ్వలేను
ఇవ్వకూడదు కూడా..
