Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meegada Veera bhadra swamy

Tragedy

3  

Meegada Veera bhadra swamy

Tragedy

కంచెను దాటిన కడలి

కంచెను దాటిన కడలి

1 min
448


                "కంచెను దాటిన కడలి"


కల్లోల కెరటం

కట్టలు తెంచుకొని

కంచెను దాటింది

కడలి కడుపున

ఏ కోత మొదలైందో....!


తడి ఆరని ఈ కంటి

లోతు పొరల్లో ఆ

సున్నిత హృదయం ఎన్ని

ఆటుపోటుల మేటలకు గురై

అగ్ని పర్వతమై కూలిందో...!


స్వచ్ఛత రెక్కలు తొడుగుకొని

అప్పుడే స్వేచ్ఛగా....

ఎగరాలని యత్నించిన ఆ

పక్షి రెక్కలను ఏ రక్కసి

విరిచి పట్టి వేదిస్తుందో...!


చప్పుడు పెరిగిన

గుండె కావాటాల్లో

ఏ ఉప్పెన ఉబికిందో

నిత్యం నవ్వుతు వుండే

కళ్ళలో కార్చిచ్చు రగిలింది!


చెంగున ఎగిరే లేడి మనసులో

ఏ ముష్కరుని మాటల

శరాఘాతం గుచ్చుకొని

గుణ'పామై' కరిస్తుందో

ఇక్కడో నిత్య వేదనా వరద!


ఆ కళ్ళలో కావ్యాలుతో

కాళిదాసుల్ని కదిలించి

కలం పట్టించిన వనిత నేడు

కన్నీరు హాలాహలానికి

జన్మనిస్తుంది ఎందుకో...!


పాపం ఆ కంటి పాపలు

ఏ 'పాపి' కొండల

సుడిగుండాల్లో చిక్కుకొని

దిక్కులు పిక్కటిల్లేలా లోతుగుండె

ఆర్తనాదాలు చేస్తున్నాయో...!


ఈ కలకంటి ఎదచదునుపై

ఏ కలకలం కారం జల్లి

కేరింతలు కొడుతూ....

ఆత్మాభిమానాన్ని అదిమిపట్టి

ఉక్కిరిబిక్కిరి చేస్తుందో...!


ఈ చిలుకను వదిలిన

ఆ గోరింక ఆచూకీ తెలియక

గోడలు దాటని ఆ గోదారి

ఏ దారీ కానరాక వరదై

ఒడ్డున వర్షదారలౌతుందేమో...!


అమ్మతనం చవిచూచిన

కమ్మని తల్లి మనసున

సంతోష సునామీ....ఏమో!!!

ప్రవాహ వేగం హెచ్చి

తగ్గుముఖం పడుతుందేమో...!


ఈ నిప్పును ఏ తప్పుడు జల్లు

ముప్పుతిప్పలు పెడుతూ

ఆనంద అగ్ని జ్వాలలను ఆర్పేస్తూ

మాడ్చి మసిచేసి మనసునుండి

నిరసన జలాన్ని చిమ్మిస్తుందో...!


ఆ లెక్కన యీ ఒక్క కన్నీటిబొట్టు

చుట్టుపక్కల హృదయాలను

తరిగి తరిగి కరిగించి కారుణ్యం

కరుణామయులను చేస్తుందని

ఆశించి ఆశావహులు మౌదాం!


పన్నీటి బావినుండి కన్నీరు

కారణాలు సవాలక్ష!!!

అలిమిని బలిమి బాధిస్తే

బలిమి భవిత మొత్తం

స్మశాన సంగీతమే!


ఆ సంద్రపు ఆలలపై

కలవడి తెర నావలు నడవాలి

ఆ పంటి బిగువు వెనుక

కల్లోల తుఫానులు తొలిగి

కమనీయ దృశ్యాలు ఉండాల!


నిండుకుండను సూటి పోటి

అరుపులు కాకులు కకావికలం

చేస్తూ....గుండెనిండా

నిందా నల్లనిరాళ్లను కుమ్మరించి

కులుకు నవ్వులు రువ్వుతున్నాయా!!!



ఏమో....! ఏమైందో...!!

ఆ కన్నీటి కుండ పగిలింది!!!




















Rate this content
Log in

Similar telugu poem from Tragedy