STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

కలవరమో ఇది..

కలవరమో ఇది..

1 min
239

చదువొక్కటే భవితను మారుస్తుందని నమ్మకం

అతనికి నచ్చజెప్పిన కుటుంబం

నిజమేనన్న సమాజం

కాదా అని ప్రశ్నించలేము

అలా అడగడం సబబు కూడా కాదు


చదివాడు అతను ఎన్నో

డాక్టర్ ఇంజనీర్ ఇలా ఏమవ్వాలనో

ఏమీ అవకుండా ఉంటే తప్పా అనేంతలా చదివాడు

ఇదే కలవరం ఆలోచనను రేకెత్తించింది


అదేంటి 

మరి చదివిన చదువుకు సార్థకత ఏమిటన్నారు

అతను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాడు

మరింత మందిని సంస్కారవంతుల్ని చేయడానికి

అడుగు ముందుకు వేసాడు


Rate this content
Log in

Similar telugu poem from Abstract