STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Fantasy Others

4  

VENKATALAKSHMI N

Romance Fantasy Others

కలల స్వాప్నికుడు

కలల స్వాప్నికుడు

1 min
326

మీనాల్లాంటీ కన్నులంటూ 

ఎదవీణను మీటుతాడు..

కెంపుల చెక్కిళ్ళు ఎరుపెక్కేలా

సిగ్గుల సిరులు కురిపిస్తాడు..

చిరుమందహాసపు చివురుల 

మధువులను గ్రోలే 

జుంటి తుమ్మెదవుతాడు..

నా కన్నీటి చారికలకు

పరిచారికగా సేవలందిస్తాడు..

నా కోపం మహానదిలో

మునకలేస్తుంటే తెప్పలా

స్వరాలు పలికిస్తాడు..

నా ఆశయాల ఆశల రథానికి

రథసారధిగా మారతాడు..

గుప్పెడు గుండెలో

ఉప్పెనంత ఊహలకు తానే

ఊపిరి పోస్తాడు..

నా గమనానికి గమకం

తమకం తనేనంటూ 

నిగర్విలా గర్విస్తాడు..

నా పలుకుల కులుకులకు

ఆపాదమస్తకం దాసోహమంటాడు..

నా అపరిష్కృత సమస్యలకు

సమాధానం చూపే సైనికుడవుతాడు..

నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తన శ్వాసగా

చేసి విశ్వాస పాత్రుడవుతాడు..

మదిలోని అలజడులకు

సాంత్వననిచ్చే ప్రశాంత 

అలగా మారుతాడు..

నా కలల సౌధంలో పందిరి వేసి

తన మదినే ప్రేమ

మందిరంగా మారుస్తాడు..

నా కవితలను కావ్యంగా

మలిచే భావాలకు 

భాండాగారంగా మారతాడు..

నన్ను వెన్నంటి వుండే

వన్నియ వాడు..

స్వచ్ఛమైన సంకల్పి వాడు..

సందేహమే లేదు

వాడు నావాడే..

నాలో..నాతో..

నన్ను నిత్యం వెంటాడే 

నా కలల స్వాప్నికుడు

హృదయాంతరాళంలో మెదిలే

మాయల మాంత్రికుడు..


Rate this content
Log in

Similar telugu poem from Romance