కౌగిలిలో కరిగిన మనసులు
కౌగిలిలో కరిగిన మనసులు
నీ మనసు నా మనసుతో మాట్లాడలేనప్పుడు
నీ పెదాల నుండి వచ్చే మాటలు
నీ పనులతో ముడిపడనపుడు
నీ ఇష్ట ఇష్టాలు, నీ ఇష్ట ఇష్టాలతో జతపడనపుడు
ప్రియమైన సంభాషణల కంటే
వాదాలు, తగాదాలు ఎక్కువైనపుడు
సన్నిహిత్యం తగ్గి సాకులు పెరిగినపుడు
సరసమైన అభినందనలు తగ్గి
స్వీయ అంచనాలు పెరిగినపుడు
సందేశాలు బాగా తగ్గి సందేహాలు పెరిగినపుడు
నిన్ను కోల్పోతాన్నన్న భయం పెరిగినపుడు
ఇక నీతో నేను కలసి ఉండలేను
నా కళ్ళలో నీవు కనపడనపుడు
నా మాట నీకు ఉపశమనం కలిగించనపుడు
నా కౌగిలి నీకు ఆనందాన్ని ఇవ్వనపుడు
నా స్పర్శ నీలో అలజడిని సృష్టించనపుడు
నా పెదవుల రుచిలో తియ్యదనం లేదన్నప్పుడు
నా హృదయం నీకు స్వాంతన ఇవ్వనపుడు
నాతో ప్రయాణం ఎడారిలో నడకలాంటిది అయినపుడు
ఇక నాతో నీవు కలసి ఉండలేవు
కొన్ని మాటలు నీకు మాములుగా ఉండవచ్చు
కానీ అవి నాకు బులెట్ లాంటివి... అవును ...
నీ మాట నాకు తూటాల్లా గుండెలోతులోకి
దిగి మెలిపెట్టి ప్రేమ చేదు పాఠలను నేర్పుతున్నవి
జరిగింది తెలియక నీ జీవితంలోకి వచ్చాను
నాకు తాగినా శాస్తి జరిగింది
ఇక మనం కలిసి ఉండలేము.....
ఏహే ఆగు...
నేనే ఇక రాజీ పెడతాను.....
నాతోనే కలసి ఉండు....
నీ అంత బాష నాకు తెలియదు
నీ అంత సాహిత్య భావాలతో నేను
నా ప్రేమను వ్యక్త పరచలేను
సరే ఎక్కువ సమయం నీతో గడుపుతాను
నీ ఇష్ట ఇష్టాలే నా ఇష్ట ఇష్టాలు సరేనా!
అసమ్మతి, ఘర్షణలు లేకుండా ఏకీభవిస్తాను
నాతోనే కలసి ఉండు....
అతిగా ఆలోచించకు...
ఆవేదన చెందకు....
నేనెప్పుడు నీ వాడినే.....
కానీ చివరగా నాదో సలహా...
ఉదయం వీడ్కోలు ముద్దు నేనిస్తాను
సాయంత్రం స్వాగతం ముద్దు నీవు ఇవ్వు
మన మనసులు కౌగిలిలో కరిగి
ప్రేమసాగరంలో అలల అల్లుకుని
ఆనంతంలో ఆది దంపతులవుదాం...ప్రియా!

