కావ్యమే ఆమె
కావ్యమే ఆమె
నవ్వుల సిరులు
మువ్వల ఝరులు
గాజుల గలగలలు
జడగంటల జగడాలు
కన్నుల్లో మతాబులు
కనులేమో కాకరవత్తులు
పేరేమో పున్నాగవల్లి
తన ఆటేమో పూబంతుల్లో
చిరునవ్వే తన అభరణం
చిరుదరహసాల చైత్రం
చందనాల చర్చితం
సుగంధ రసభరితం
తన ఆరాధనే ప్రేమతత్వం..
తానోక సుందర సమధుర హాసం..
తానొక తలపుల మధుర కావ్యం..
ఆమె కావ్యాలంకారంలోని అలంకారం కాదు...
కావ్యమే ఆమె.
