కార్తీకమంటే నెలంతా పండుగ
కార్తీకమంటే నెలంతా పండుగ
సూర్యకిరణాల కంటే ముందే పరుగులు
చన్నీటి స్నానాలు
కార్తీక దీపాల వెలుగులు
పురాణ పారాయణలు
దీప దానాలు
తిథుల లెక్కలు
వన భోజనాలు
సాయంకాల సమయాన ఆకాశ దీపాలు
ఆలయాలు నిండిపోయేంత భక్తులు
అర్చనలు అభిషేకాలు
పసుపు కుంకుమల వెల్లువలు
నిద్ర సరిపోక ఆవులింతలు
అయినా నీరసించక
పోటీ పడుతూ పెట్టే దీపాల వరుసలు
నాకైతే కార్తీక మాసం
ప్రతిరోజూ ఓ దీపావళిలా అనిపిస్తుంది
కార్తీకమంతా పండుగ చేయమని
మనసు పూర్తిగా శివునిలో లీనమవుతుంది
