STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Fantasy

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Fantasy

కామన్ MAN కలర్స్!

కామన్ MAN కలర్స్!

1 min
270

కలియుగాన..

కలవారికి మాత్రమే కలవనుకుంట..

కలర్ ఫుల్ కలలు కనే అవకాశాలు!


జగతిన కలవెన్నో అందమైన కలలు

కానీ!జీవితాన కలర్స్ కలవారెందరు?


నలుపంటే.. భయపడి

తమ నయనాలను మూసి..

రేపటి తెలుపుకోసం 

కలలు కనే కామన్ మ్యాన్ కి

కొన్ని కలర్స్ అయినా అందేదెపుడో!


కడుపుకోసం..

కలావంతులు తమ తనువును

రంగురంగుల కాంతులలో..

కాంతివంతంగా చేసుకొని..

కాగితపు నోట్లలో కరిగిపోతున్న వేళ..


అవే..నోట్లు ఎక్కువై..

నిశి రాత్రి వేళ..నిషా మత్తులో

బడాబాబులు యెన్నో కలర్స్ ని

ఆస్వాధిస్తున్నారు!


రుధిర రంగు విలువ తెలిసిన..శ్రమజీవి

రక్తాన్ని చెమటగా మార్చి..

తన చిన్నపాటి రంగుల ప్రపంచాన్ని

పొందికగా..పొందేందుకు చూస్తుంటే..


పైశాచికత్వానికి..పరాకాష్ట లా

మయన్మార్ మిలటరీ నియంతలు

నేడు..

కామన్ మ్యాన్ను కాల్చి మరీ..

తమ సింధూరపు వర్ణ...

దాహాన్ని తీర్చుకుంటున్నారు!


ఓ...రంగుల ప్రపంచమా!

పైసలున్నవాడు..

పంచాధిక వర్ణాలను ఆస్వాదిస్తూ..

ఇంకా ఇంకా..ఆరాటపడుతుంటే!


లోలోపల..యెన్నో ఆటుపోట్లున్నా..

నిశ్చలంగా కనిపించే సముద్రపు..

నీలి వర్ణంలా..

కష్టాల కడలిలో కూడా..

నిశ్చలంగా ఉంటున్నాడు చూడు

వాడిదే..

నిజమైన... హోళీ!


       .....రాజ్....


Rate this content
Log in

Similar telugu poem from Tragedy