కాలుష్యం
కాలుష్యం
ఉద్యోగాలు ఫేక్టరీల వలన వస్తాయన్నారు,
ప్రజలు ఆశగా భూములనిచ్చారు,
ఇంటికొక ఉద్యోగమని నమ్మించారు,
ఉద్యోగాల కోసం పడిగాపులు కాశారు.
ఊరూరా ఎన్నో ఫేక్టరీలు పెరిగాయి,
వాటి చుట్టూ జనావాసాలు లేచాయి,
ఫేక్టరీల పొగలు మేఘాల్లా కమ్మేశాయి,
వాతావరణాన్ని కలుషితం చేశాయి.
ఉద్యోగాలు రాలేదు ఊరి యువతకు,
ఏదీ లేక కష్టాల పాలైంది వారి బ్రతుకు,
ఊరి పచ్చదనం, ఆరోగ్యం పోయె కడకు,
నాగరికత ఏమి మిగిల్చె వారికి తుదకు.
భూములిచ్చిన రైతులు కూలీలైనారు,
అన్నదాతలు తిండికి అలమటించారు,
పంటలు లేక వ్యాపారులు ధరలు పెంచారు,
కొనలేని బీదాబిక్కీ యాచకవృత్తి చేపట్టారు.
దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందాలి,
వ్యవసాయం కుంటుపడితే దేశమేంకావాలి,
నాలుగు వైపుల నుండీ అభివృద్ధి చేయాలి,
దేశం సర్వతోముఖాభివృద్ధికై పాటుపడాలి,