STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

కాలం ‌.‌‌..

కాలం ‌.‌‌..

1 min
264

గుప్పిట్లో ఇసుకలా జారిపోతోంది కాలం...

క్షణం గడిచిన మరుక్షణం ఈ క్షణం తిరిగిరాదన్నది నిజం...


మరలి రాని కాలంలో...

ఈ ఈర్ష్య, ద్వేషాల ఈసడింపులెందుకు...

పంతాలు, పట్టింపుల పోరాటాలెందుకు...


పక్క వాడి జీవితంపై ఆధిపత్యపు హక్కు ఎవరిది...

నీ జీవితమే జీవించలేని నిస్సహాయత నీది...


చేదు జ్ఞాపకాల గుండె కోతల్లో నీడలా ఉండటమెందుకు...

నిన్నటి తీపి గుర్తులుగా మిగిలిపోదాం...

నేటి ఆనందంలో భాగస్వాములవుదాం...

రేపటిని సుఖమయం చేసుకొందాం...

                                 -సిరి✍️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational