STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Tragedy Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Tragedy Fantasy

జ్ఞాపకాల ప్రేమ లేఖ

జ్ఞాపకాల ప్రేమ లేఖ

1 min
497

నిత్యము నీ తలపులతో యుద్ధం చేస్తునే ఉన్న

మనల్ని విడదీసే శక్తి కాలానికి లేదు 

నిన్ను నేను వెతుకుతుంటే .....

మళ్ళీ నీ జ్ఞాపకాలు నా వొళ్ళంతా వెన్నెలై కాసింది

మళ్ళీ నీవు నన్ను వెతుకుతూ  

నీవు నా ఒడిని చేరాలని 

మన రసభరితమైన జ్ఞాపకాల ప్రేమ లేఖను రాస్తున్న...


ఒకసారి విను నా ప్రియుడా......


నా వాలు జడలో నీవు తురిమిన 

సిరిమల్లెలలు నీతో సరసాలు నేర్చుకోవాలని 

సిగ్గు పడుట నీవు చూస్తలేవా

నా చీరకొంగులో నా నడుము ఒంపుల్లో 

దాగి ఉన్న సంపంగి పువ్వులు నిన్ను అకర్షిస్తలేవా

రంగులు పులుముకుని ఆకాశాన్ని తొంగి 

చూస్తున్న నా కళ్ళు నిన్ను కవ్విస్తలెవా

నా కళ్ళు నీ కళ్ళతో ప్రణయ రాగలను పలికించి 

నీ మనసుని కరిగిస్తూ కనికట్టు చేస్తలేవా

ముచ్చటగా నీవు నా మెడలో వేసిన 

ముద్దుల గొలుసూలో నీవు కొలువై

నా ఎద సంగతులన్నీ వినటలేదా


గర్వంగా నా తనువును పెనవేసిన చీర

నా యవ్వన గిరులను కప్పేసిన నా పైటకొంగు

నీ ఘాడమైన కౌగిలిలో నలిగిపోతానని

గుసగుసలాడుతు నా మనసును ఆతృతపెడుతున్నవి

నా నవ్వుల లాలింతలు ఈ రేయి సయ్యటలో

అలలై ఈ క్షణము నీ ఒడి చేరుతాయి చూడు 

తెల్లారనియ్యని నా ఒయ్యారము 

అల్లాడిపోతూ నీ ఒళ్ళో వెచ్చంగా

ఒదిగుంటానంటున్నది ఈ రేయిలో


నీవు లేక ఈ వేసవి నా దేహాన్ని వేధిస్తుంది

నా సోయగాలు నీ నును వెచ్చని స్పర్శని కోరుతున్నవి

వికసించిన పువ్వుల పరిమళ్లాన్ని

హృదయంలో పొంగిన విరహన్నీ

అంతులేని తాపాన్ని చెంతచేరి ఆస్వాదించవా

అధరం అంచులో కారిన మధురసాలని

నిగనిగలాడె నున్నని చెక్కిళ్ళని ముద్దాడి

ఈ చల్లని రాత్రుల్లో చలికి బిగువైన 

ఎదలకి బిగికౌగిలి బిగించావా 

ఊగుతున్న లేతగుండెల మీద 

గులాబీరంగు కమిలిపోకుండా లాలించు 

కోన్ని కన్నె కలలను చెదరనీయకుండా

యుద్ధంలో నీవు నన్ను తాకిన చోటా 

తాంబూలంతో ఎర్రగా పండిన 

నీ పెదవులతో తీయ్యని ముద్దులు పెట్టేస్తు 

నీ వేడి కోపాన్ని చల్లార్చుకో


అలసిపోయిన నా తనువు అణువణువులు 

నీవు నన్నెపుడు అక్రమించుకుంటావని 

ఆశగా చూస్తున్నాయి 

ఈ వింత అనుభూతిని అనుభవిస్తున్న 

నా మనసుకే తెలుస్తుంది 

నీ ఎడబాటు ఎంత కష్టమో,

నీ జ్ఞాపకాలు అంతే మధురం

నా గుండెలో భద్రపరుచుకున్న నీ జ్ఞాపకాలతో

నాకు తిరిగి మళ్ళీ జీవం పోస్తావు

అందుకే ప్రతి రోజు నిన్ను చూడగలను

ప్రతి ఘడియ నిన్ను తాకగలను

ప్రతి క్షణం నీ మాటలు వినగలను

ప్రతి ఉదయం నీ దేహ సువాసన పీల్చగలను

ప్రతి సంధ్యలో నీ పెదవులను రుచి చెయ్యగలను

ప్రతి రాత్రి నీ అనుభూతిని గుర్తుకు తెచ్చుకోగలను

అందుకే కాబోలు ఈ పారిజాత పూలకొమ్మకు

నీ జ్ఞాపకాలంటే చాల ఇష్టం



Rate this content
Log in

Similar telugu poem from Romance