జాజుల జవరాల
జాజుల జవరాల
ఉప్పెనలాంటి ఊహవై
ఊరడించే ఊపిరివై
ఆడించే అల్లరివై
అలరించిన అనురాగానివై
ప్రేమామృతం పంచిన ప్రేమవై
మది వీణగా మ్రోగించావే
నవ్వులు కెరటాలై ముంచేసాయే
మనసుకు అద్దిన పరిమళమై
కుసుమాలుగా కురుస్తున్న నీ పలుకులు
మాటల మరువాలు మారాకుల దొంతరలు
ఝామురాతిరి జాగేల జావళీల జాబిలి
నా మనసు జగమేలే జాజుల జవరాల
నీ వలపు పిలుపు నా హృదయాన కురిసేనే మరు మల్లెలు జడివాన

