ఇష్టమైనవారి లోపం
ఇష్టమైనవారి లోపం


జీవితంలో ఒంటరిగా ఉండటం అసాధ్యం,
అందరికీ అత్యవసరం ఎదో ఒక బాంధవ్యం |౧|
ఎంతో అపురూపం ప్రతి ఒక్కరికి రక్తసంబంధాలు,
అందరికి ఒక్కసారే వచ్చెను ఈ అరుదైన అనుబంధాలు |౨|
తెలియదు ఎలా గడిచెనో దగ్గరవారితో సమయం,
వారితోనే పంచుకొనెను ఒకరు ప్రతి ఒక్క అభిప్రాయం |3|
అన్ని విషయాలలో ఉండెను నిర్ణీత ఆరంభం,
అన్ని విషయాలకు ఉండెను నిర్ణీత అంతం |౪|
కాలం అవుతున్నకొద్దీ బాంధవ్యాలు అయ్యెను దూరం,
కొంతమంది ఎన్నడూ రాకుండా అయ్యెను చేరనంత దూరం |౫|
నిరంతరం జ్ఞాపకం వచ్చెను ఇష్టమైనవారి లోపం ,
అస్థిరమైన మనసులో రగిలెను మిగిలెను తీవ్ర సంతాపం |౬|