STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఇంకాసేపుండొచ్చుగా

ఇంకాసేపుండొచ్చుగా

1 min
6

వచ్చిన వెంటనే వెళ్లాలని నువ్వు

తారా స్థాయికి చేరిన కోపాన్ని

తారల్ని చూపించే రాత్రితో దూరం చేయాలని నేను


ప్రయత్నాలతో కొత్త పరిచయాలు

ఆ రోజు నువ్వెళ్ళిపోయాక

మార్కెట్ నుండి వస్తుంటే ఫోన్ పోయింది

ఫిర్యాదు ఇస్తే అంతలా ఏముంది ఆ ఫోన్లో అన్నారు


మళ్ళీ నీతో ఫోటో దిగలేను కదా

మొన్న సమయాన్ని పొగల్లో కలుపుతూ

టీ షాప్ దగ్గరే కూర్చున్నాను

ఎవరో అమ్మాయి

బస్సు కిటికీ లోంచి చూసి 

నన్నే పిలుస్తోంది


నువ్వు తప్ప నన్నెవరూ గుర్తు పట్టరు కదా

ఏంటని అడిగాను

దగ్గరికి పిలిచి చాక్లెట్ ఇచ్చింది

ఎందుకో నవ్వు వచ్చింది

భిక్షగాడిలా కనిపించినా 

చిల్లర కదా ఇవ్వాలి


నా కళ్ళల్లో ఒంటరితనం కనిపించిందో ఏమో

ఆ విషయం వదిలేసి 

నా పాటికి నేను వెళ్ళిపోయాను

కింది ఇంట్లో వాళ్ళు ఖాళీ చేస్తున్నట్లు ఉన్నారు


నా వైపు అదోలా చూసి

వాళ్ళల్లో వాళ్లే గుసగుసగా మాట్లాడుకున్నారు

నేను పైకి వెళ్ళేసరికి

గదంతా ఏదో వాసన

ఏదో జీవి చనిపోయిన పరిస్థితి

ఏమీ అర్థం కాలేదు

జేబు తడిమితే చాక్లెట్ కనిపించింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract