ఇంకా ఎన్ని దసరాలు కావాలో!
ఇంకా ఎన్ని దసరాలు కావాలో!
చెడు పై..
మంచి సాధించిన విజయమే...దసరా!
దుర్గమ్మ తల్లి...
నువ్వే మా అందరికీ...ఆసరా!
ఈ దసరా రోజున..
మాలో ఉన్న...
కామ క్రోధాలను...
కబళించే... కాళికవై రా!
మద మాత్సర్యాలను..
మసి చేసే..మోదకొండమ్మవై రా!
అమానవత్వాన్ని...
అంతమొందించే..అంబికవై రా!
రాక్షస గుణాలను..
రూపుమాపే... రాజేశ్వరివై రా!
దురాశ ను...
దూరం చేసే..దుర్గవై రా!
అహంకారాన్ని...
అణగదొక్కే...ఆదిశక్తివై రా!
బలహీనతలను..
తరిమేసే...భవానివై రా!
జగితిని...
సుభిక్షంగా ఉంచే...జగన్మాతవై రా!
ఈ..దసరా రోజున
ఒక...మహిళామూర్తిని..
కాళికా అవతారాన్ని...
చూసేందుకు ..కొలిచేందుకు..
భయభక్తులతో...
సిద్ధమయ్యే...
ఓ...స్త్రీ పురుషులారా...
మరి!
ప్రతిరోజూ....
అబలల పట్ల జరిగే..
అవమానాలకు..
గృహ హింసలకు..
లైంగిక దాడులకు..
అత్యాచారాలకు..
పైశాచిక హత్యలకు..
మీ...
ప్రతిస్పందన ఏమిటి?
మీ..
బాధ్యత ఎంత?
అసలు...
ఈ..అకృత్యాలు జరగటం..లో..
మన పాత్ర ఉందా...లేదా?
అని...కనీసం
ఈ దసరా రోజైనా... ఆలోచిస్తున్నామా?
ఓ...భవాని!
మా..నరనరాల్లో
జీర్ణించుకుపోయిన..దుష్టగుణాలను
అంతం చేసే నీ ఆదిశక్తి ..
స్వరూపాన్ని చూసేందుకు...
మేము ఇంకా ఎన్ని దసరాలు..
వేచి చూడాలి...తల్లి!
మిత్రులారా...
వాహనాలకు....వస్తువులకు
పట్టిన మురికిన వదిలించడమే...
దసరా.....కాదు!
మన మనసులకు...
పట్టిన మాలిన్యాన్ని....కడిగెయ్యడమే
నిజమైన....దసరా!
.......రాజ్.....
