ఈ లోకమందు మోహము నీ కొద్దు...
ఈ లోకమందు మోహము నీ కొద్దు...


ఎవడివి రా? నీవు ఎవడివిరా ?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా?
అద్దె బట్ట ధరించి అద్దె ఇంట్లో ఉంటూ..
శాశ్వతం కానీ ఈ వస్తువులను నావి అంటూ.. !!ఎవడివి రా?!!
నా కులం.. నా మతం.. అంటూ...
నీవు ఏదో ఈ జన్మను కోరి తెచ్చుకున్నటూ.... !!ఎవడివి రా?!!
సమాజంలో ఉంటూ.. వారి సహాయం తీసుకుంటూ...
ఇది నా వల్లే జరిగింది అంటూ..అది నా గొప్ప అంటూ ... !!ఎవడివి రా?!!
నీ ఎదుటే ఇన్ని రకాల జన్మలు ఉంటూ ఇన్ని రకాల జీవరాశులు ఉంటూ...
ఏ ఒక్క జన్మలో అయినా ఏ ఒక్క జీవరాశి అయినా పోరాడి సాధించింది ఏమిటి అని గ్రహించమంటూ... !!ఎవడివి రా?!!
మూడు రోజుల ఆట లో మురిసిపడుతున్నావు కళ్ళకుగంతలు కట్టుకుంటూ..
చేరుకో... నీఇంటిని ఈ అద్దె ఇంటి ధర్మాలను పాటించు కుంటూ...
ఎవడివి రా? నీవు ఎవడివిరా ?
ఈ లోకమందు మోహము నీ కొద్దు రా!!