హ్యాపీ.... శ్రీనివాస భారతి
హ్యాపీ.... శ్రీనివాస భారతి


పుట్టుక
ఏం సాధిస్తామో తెలియని
హ్యాపీ బర్త్ డే లు
పెరగడం
ఏం చేయాలో తెలియని
చదువుల మధ్య
బంధాల బంధనాలు
యవ్వనం
దూరంగా...హాస్టల్లో
జైలు పక్షిలా
రేపటి ఆశా జీవితం కోసం
తనకు తానుగా
బిగించుకున్న సంకెళ్లు
పెళ్లి
ఆశల కాసులకు
వృత్తి వ్యాపారంలో
భిన్న ఆలోచన్లు కలసి కాపురం
పిల్లలు
రేపటి తరం
ఊహాల్ని
ఈవేళే చదివేసి
డబ్బు కుప్పల మధ్య
జ్ఞానాన్ని కొనుక్కుంటూ
తనను మించి పోవాలని
వర్తమానం
అన్నీ దాచుకొంటూ
కొన్ని అందరికీ పంచుతూ
గడియారం గంటల్ని
కొనేవాళ్ళ కమ్మేస్తూ
భవిష్యత్తు
పాత జ్ఞాపకాలు..
దాగున్న రోగాలు
ఒకొక్కటిగా
శరీర పొరల్ని చీల్చుకొంటూ వస్తే
సంపాదన ...
ఆసుపత్రి బిల్లుగా మారి
అప్పుడు వెక్కిరిస్తుంటే
వృద్ధాశ్రమం లో కూర్చుని
ఎవర్నో పెంచుకున్నానని
ఆవేదనెందుకు పడతావ్..
వాడిగురించిన నిజం
నీగుండెల్ని దాటి బైటకి రాని విషయం
బహుశా
నీ మరణం కూడా చెప్పలేదేమో...
-------౦౦౦౦౦౦౦౦౦------