STORYMIRROR

Nannam Lokesh

Inspirational

4  

Nannam Lokesh

Inspirational

హృదయము ఒక రహస్యము

హృదయము ఒక రహస్యము

1 min
821

చూసిన మరుక్షణము ఏర్పడే ఆలోచనలు

మనసులో అప్పుడప్పుడు మెదిలే భావాలు

మనసుకు ఇంపుగా ఉండే కదలికలు

ఏర్పరచిన విడదీయని హృదయ అంతర్గతాలు


కాలం కలిసిపోయి రావొచ్చును మార్పులు

హృదయంలోని గాయాలు ఒక జ్ఞాపకాలు

శరీరానికి అనుగుణంగా ఉండే ప్రవర్తనలు

దారి చూపడానికి పలికే ఆనవాలు


సుఖము వర్షముల వచ్చునన్న ఎదురుచూపు

కష్టము వెనుకకు వెళ్ళునన్న ధైర్యము

భయము వచ్చిపోయే ఇంద్రధనస్సు లాంటిది

అభయము మరిచిపోలేని ఒక దేవాలయము


కోరికలను కలలుగా తీర్చే సాధనము

ఒంటరి తనమునకు అభయ హస్తము

ప్రేరణ కలిగిన చెప్పే పరికరము

హృదయము నిజానికి ఒక రహస్యము



Rate this content
Log in

Similar telugu poem from Inspirational