గజలైనది
గజలైనది
చైతన్యపు'జాహ్నవి'యే..అలరించే గజలైనది..!
చెలిమిపూల నదితానై..ప్రవహించే గజలైనది..!
చైత్రవీణ తంత్రులలో..ప్రణయరాగ వాహినియే..
స్వరాతీత రాగసుధను..పొంగించే గజలైనది..!
ఊహలేలు మెఱుపులింటి..నాట్యమెలా చూపాలో..
వర్ణనలకు లొంగకనే..ఊరించే గజలైనది..!
వేనవేల రూపాలకు..అక్షరాల మూలధనం..
నిత్యమౌన వేదాంతం..వడ్డించే గజలైనది..!
ఛాందసాలు కాల్చివేయు..చిదగ్నియే తనహాసం..
వేదించే విరహాలను..వదిలించే గజలైనది..!
సంస్కృతీ సంప్రదాయ..రక్షాకర దీక్షామణి..
కవిగాయక విప్లవాగ్ని..రగిలించే గజలైనది..!
