ఎవరు?
ఎవరు?
మావి చిగురుకి పచ్చదనం ఇచ్చింది ఎవరు?
ఎర్ర పువ్వుకి అత్తరు అద్దింది ఎవరు?
చేప పిల్లకి పరుగు నేర్పింది ఎవరు?
తేనెటీగకి స్వరము నేర్పింది ఎవరు?
స్పటిక గాలికి స్పర్శని ఇచ్చింది ఎవరు?
రంగుల చిలకమ్మకి రంగు పూసింది ఎవరు?
మిలమిల మెరిసే మిణుగురమ్మకి కాంతి పోసిగింది ఎవరు?
పూల అందాలకి సొగసులు నింపింది ఎవరు?
వేలాడే ఆ పండ్లకి తీపిని అందించింది ఎవరు?
ఇవన్నీ ఉచితంగా నీకు అందించింది ఎవరు?
ఇన్ని ఇచ్చిన ప్రకృతిని నాశనం చేసే హక్కు నీకిచ్చింది ఎవరు?
దాని శక్తిని చూసి తట్టుకుని నిలబడగలిగేది ఎవరు?
ఉచితంగా ఇస్తుంది అని అలుసా?
మాట్లాడలేదని బలుపా?