ఎవరు నీవో
ఎవరు నీవో
ఎవరు నీవో ఎవరు నేనో బ్రతుకు శకటంలో
గెలుపు ఏదో ఓటమేదో తుదకు సమరంలో
తావిపంచే పూలకైనా గాలివాటం తప్పదు
ఎత్తు ఏదో పల్లమేదో చివరి పయనంలో
జగతి అంతా అంధకారం ప్రేమకళ్ళతొ చూస్తె
నీడ ఏదో జాడ ఏదో ప్రేమ తిమిరంలో
లాభముంటే తప్పునైనా ఒప్పులేగ "చల్లా"
శిక్షలెన్నో బాధలెన్నో పైన నరకంలో
చపలచిత్తం మాటవినదూ నిలువరించుట సాధ్యమ
దుఃఖమెంతో శాంతమెంతొ మనసు కుహరంలో
