STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఎందుకు ప్రేమా?

ఎందుకు ప్రేమా?

1 min
363

కవ్వించావ్

నవ్వించావ్

కళ్ళు మూసుకుపోయేలా చేశావ్

నన్ను మత్తులో ముంచేశావ్


నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడేలా చేసుకున్నావ్

ఏం సాధించావ్

నా నుంచి దూరమయ్యావ్

నా ఉనికిని ప్రశ్నార్థకం చేశావ్


ఎందుకు

లేని ప్రేమను ఉన్నట్టు మాట్లాడావ్

ఎందుకు

ఉన్న బుర్ర పని చేయకుండా చేశావ్


ప్రేమా

ఎందుకు మనసుతో చెలగాటాలు

ఎవరు నేర్పారు నీకు

ఏం చెప్పాలని 

నన్నెలా మిగిల్చాలని ఇలా చేశావ్


వద్దు వద్దు అని మొత్తుకున్నా

ఎందుకు నన్ను చేరావ్

ఆనక

నన్ను శాశ్వతంగా వదిలి వేశావ్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract