ఎల్లలు లేని మైల
ఎల్లలు లేని మైల
గుడిలో మైల
బడిలో మైల
నేలతల్లి ఒడిలో మైల
గాలిలో మైల
నీళ్లలో మైల
నీడలోమైల
నేలమీద మైల
మాటల్లో మైల
స్పర్శలోమైల
శబ్దంతో వాతావరణం మైల
చాకళ్ళు బట్టలు ఉతికితె మైల
మంగల్లు వెంట్రుకలు కత్తిరిస్తె మైల
కుమ్మరులు కుండలిస్తె మైల
నేతన్నలు బట్టలిస్తె మైల
వైశ్యులు సరుకులిస్తే మైల
మడి మనిషికి ఎదురుపడితే మైల
తోటి విద్యార్థులు మాట్లాడితే మైల
ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే మైల
నోట్స్లు దిద్దితే మైల
నోటితో మాట్లాడితే మైల
సైగలు చేస్తె మైల
పక్కన కూర్చోంటే మైల
తరగతిలోకి రానిస్తె మైల
బోర్డు దగ్గరకు వెళ్ళనిస్తె మైల
ప్రభుత్వ విద్య సంస్థయైన మైల
ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థయైన మైల
ప్రయివేటు విద్య సంస్థయైన మైల
ఎందుకంటే అంటరాని వారంటే మైల
మహాత్ములు పుడుతున్నారు, గిడుతున్నారు
కాకపోతే కొంచెం దుమ్మెత్తిపోశారు.....
కానీ అంటరానితనం పోలేదు
సామ్రాజ్యవాదం వచ్చింది పోయింది
సంస్కరణల వాదం ఆరిచింది ఆరింది
కానీ ఈ దేశంలో ఎటు చూసినా
మైల...మైల....మైల
ఎల్లలు లేని మైల, ఏండ్లయిన తొలగని మైల
(అంబెడ్కర్ కాలం నాటి సామాజిక దుస్థితి)
