Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

ఎక్కడిదాకా !

ఎక్కడిదాకా !

1 min
308



మనిషిచూపులు ఎక్కడికి అంటే ,

కంటికి కనిపించే వస్తువులేమిటో తెలిసేదాకా .

అదే , ఊహలు ఎక్కడికంటే ,

పుస్తకంలో చదివిన విశ్వపుటంచుల దాకా !


కానీ , ప్రేమలో పడ్డవారికి ఒకరికొకరే లోకం ,

ప్రతినిమిషం తపించి మురిపించేదే చిద్విలాసం .

వాని ఆశలకు శ్వాస కావాలని ,

ఆనందంలోని అనుబంధానికి కారణమవ్వాలని .

ఎదురుగా తానే ఎపుడూ కనపడాలని ,

నవ్వుల పువ్వులు కురిపించాలని .


ఉదయమే శుభములు ఫోనులో ,

సాయంసంధ్య వరకు సమయం ఊసులలో .

నచ్చేరంగుల దుస్తులు

ధరించినచో ముఖం చంద్రబింబం .

బహుమతులూ

అందినచో ఆకాశపుచుక్కల పందిరిలోనే

కాసేపు ఆనాటి విజయవిహారం .


ఏకాంతంలో ఇద్దరు గడపగా సరదాసరదా .

ఛలోక్తులు విసరగా సిగ్గులవరదే మధురంగా .

విరామం వస్తే క్షణమొక యుగమని నిట్టూర్పులు .

అనుకున్నది అసలు జరగనేలేదా

దేవదాసు పార్వతనే వినిపించును ఓదార్పులు !



Rate this content
Log in