STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ఎక్కడైనా నేనున్నానా

ఎక్కడైనా నేనున్నానా

1 min
175

గుబురుగా పెరిగిన గడ్డంతో

తినేసేటువంటి చూపుల్తో

నేను నీకు కనిపించానా


లోలోపల చనిపోయి

బయటికి నవ్వే శబ్దాల్లో

నేను నీకు కనిపించానా


చేసిన వాగ్దానాలు వదిలేసి

నీతులు చెప్పే వాళ్ళలో

నేను నీకు కనిపించినా


మనుషులంతా ఒక్కటే అని చెబుతూ

మీరేమిట్లు అని అడిగే మాటల్లో

నేను నీకు కనిపించనా


తండ్రికి తెలీకుండా తాగిన సిగరెట్ పోగలో

మందు మత్తులో 

నేను నీకు కనిపించానా


అన్ని సార్లు అన్ని విషయాల్లో

నేను నీకు కనిపించానా


నేను మాత్రమే కనిపించానా

నీకు నువ్వు కనిపించలేదా

నిన్ను నువ్వు మరచిపోయావా

లేక 

నన్ను వెతుక్కుంటూ దారి తప్పిపోయావా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract