ఏది ?
ఏది ?
వస్తాది పోతాది, మనది అనేది ఏది ?
గుర్తుండేది కలకనేది , కాదనేది ఏది ?
భ్రమ పడేది , భ్రాంతి చెందేది ,
బతికేది ఏది ?
స్వరం మార్చేది ,కలత చెందేది ,
కనుమరుగవ్వనిది ఏది ?
ప్రేమ ,స్నేహం అవదేది ,
అవరోధాలు అడ్డు ఏది ?
ఇష్టం , అయిష్టం అర్ధానికి లోతేది , గత గాయాలకు మానేది ఏది ?
జననం,మరణం ఆపేదేది ,
కలిసి నడిచే ప్రకృతికి తోడు ఏది ?
బ్రేకులు లేని కాలమేది ,
మనకు శాశ్వతం అనేది ఏది ?
సాగుతున్న మన జీవన గతి ఇది !