Saikiran Ippili

Drama

4.7  

Saikiran Ippili

Drama

ఆవేదన

ఆవేదన

1 min
459


ఆ చల్లని సముద్రగర్భంలో దాచిన ముత్యాలు ఎన్నో, వికసించిన ఈ పూలవనంలో తియ్యని మకరందాలు ఎన్నో,

గుండెల్లో రగిలించిన విప్లవ కావ్యాలలో అస్తమించిన ఆణిముత్యాలు ఎన్నో,

చిందించిన ఏరులా రక్తంలో మరణించిన ప్రాణాలు ఎన్నో,

ధన మాన వ్యామోహాలలో కూలిన మానవ సంబంధాలు ఎన్నో, బలహీన వ్యవస్థల రాజ్యంలో బలవంతుల బానిసలూ ఎందరో ,

పెనుగాలుల సాంకేతిక విప్లవంలో కమిలిన అనుబంధాలు ఎన్నో , కుల మత భేదాలలో కనుమరుగయినా జీవితాలు ఎన్నో,

గాయపడిన నా మదిలో రాయలేని విషాద కధనాలు ఎన్నో!



Rate this content
Log in

Similar telugu poem from Drama