ఎదగనివ్వండి
ఎదగనివ్వండి
అర్ధరాత్రి వేళ
కలలో కలత నిద్రలో
ఉలిక్కిపడి మేల్కొన్న
జీవమున్న నిర్జీవిని నేనేనని
ఆశలున్న నిరాశా జీవినని
స్పందన వున్నా ప్రతిస్పందన లేని ప్రాణినని
ఒడిసి పట్టి న కోరిక లన్నీ
కలలు ప్రపంచంలోకి అలలా
ప్రవాహానికి ఎదురీదలేక
పోరాడోడిన శిల్పాన్నని
సత్తువున్న నిస్సహాయురాలిననీ
పురుషాధిక్య సమాజంలో
ఆధిపత్యమనే పదానికే
అర్థమెరుగని అబలనని
మనువు సాగించిన
మనుగడ లో పరాన్నజీవి నని
సబల సమానత్వం సాధికారత
ఇవన్నీ రాతలకే పరిమితమైతేను
ఎక్కడ వుంది సమన్యాయం?
ఎప్పటికి స్వేచ్ఛ సౌభ్రాతృత్వం?
అందుకే అర్థం చేసుకొని ఆదరించండి
మా స్వేచ్చ తో మమ్మల్ని బతకనివ్వండి
అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించండి
మేమూ మనుషులమని
మాకు మనసుందని గుర్తించండి
