ఆకాశమేనా ప్రేమ హద్దు
ఆకాశమేనా ప్రేమ హద్దు
నా చిరునవ్వుల చిరునామా నీవే
నా కన్నుల్లో నిండిన కన్నీళ్ల విలువ నీకు తెలుసు
నా జీవితం వెనుక దాగి ఉన్న గతం నీవే
నా మనసులో జ్ఞాపకాలకు కారణం నీవే
అన్ని నేవే అని నీకు తెలుసు.....
నీ పలుకుల పరిమళాలను
నీ చిరునవ్వుల చిరుజల్లులను
నీ వలపుల హరివిల్లును
నీ తపనల జలపాతాన్ని
నీ జ్ఞాపకాలను మదిలో నింపుకొని
తీయ్యని స్వప్నాలుగా కనురెప్పలలో దాచుకొని...
నీకోసం నన్ను నేను తీర్చిదిద్దుకున్న...
పొగమంచులో విరిసిన గులాబీ పువ్వులా
శీతాకాలంలో చిలికి తీసిన వెన్న ముద్దలా
వేసవిలో దాహార్తిని తీర్చే ఐస్క్రీములా
వలపు రుచి ఎరుగని నీకు తీయ్యని రసగుళ్లలా
జీవ నరాలను ఉత్తేజ పరచే మెత్తని పాలకోవలా....
నీలో నన్ను కలుపుకునే క్షణాల కోసం
బరువైన గుండెతో వేచి నిలుచున్న......
నన్ను హత్తుకుంటేనే కదా
నా మనసులోని సంతోషం
నిన్ను మత్తులోకి దింపేది
నేను నీ కౌగిలిలో ఒదిగితేనే కదా
మనం స్వర్గంలో విహరించేది
నీ మీద నాకున్న ప్రేమ పరిధి
ఆకాశమంతని నీకు తెలుసు కదా
రా! ప్రియతమ రా!
కులం, రంగు, మతం, ఆంక్షలకు
మన మనస్సులు ఎప్పుడో ఎదురు తిరిగినాయి
ఇక ఇద్దరం దేశాల సరిహద్దులను దాటి
ప్రపంచ ప్రేమ యాత్రను పూర్తి చేసుకుని
ఈ అనంతమైన స్పేస్ లో ప్రేమకు ప్లేస్
అందమైన అవని మాత్రమే అని చాటుదాం...
*****

