STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

దూరంగానే ఉంటా

దూరంగానే ఉంటా

1 min
358

ఆశల్ని దాచుకుంటా

వాటిని కన్నీళ్ళల్లో చూసుకుంటా

ఇక ఇంతే నేస్తం

దిగజారిన అభిప్రాయాలు గెలవవు కష్టం


అయినా నే నిన్ను మరవను

పూలల్లో దారంలా కలవను

నువ్వే పిలిచినా పలకను

ఏదో కావాలని అడగను


నే విసిగిపోయాను

నీ ప్రతి అపజయానికీ కారణంగా

నీ ఎదుగుదలకు అడ్డంకిగా

నువ్వు ప్రయోగించే అపవాదుల తూటాలు

నీ దురదృష్టాల నమ్మకాలు


అందుకే నే దూరంగా ఉంటా

నా హద్దుల్లో నేనుంటా

మనసుకి సమాధానం చెప్పుకుని

కన్నీళ్ళల్లోని ఉప్పును ఉపయోగించుకుంటా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract