STORYMIRROR

ARJUNAIAH NARRA

Action

4  

ARJUNAIAH NARRA

Action

దేవుడు దెయ్యం మనిషి

దేవుడు దెయ్యం మనిషి

1 min
429

అంతరిక్షంలో నడియాడిన 

ఖండతారాలు దాటినా

పర్వతాలు అధిరోహించిన

సముద్రలందు జయించిన

అనంత విశ్వ రహస్యాలను

శోధిస్తున్న మనిషి......

దేవుడు -దెయ్యం భావ దాస్యం

నుండి బయట పడతాలేడు


మూఢ నమ్మకాలతో

చెట్టు పుట్ట రాయి రప్ప

ముడుపులు మొక్కులు

కానుకలు మూఢచారాలు

మహిమలు చేతబడులు

గారడి విద్యలు చూపే

స్వామిజీ, బాబాలు దండిగా ఉన్న

ఈ సమాజంలో సామాన్యుడి

అజ్ఞానమే పెట్టుబడిగా మోసపుచ్చి

కష్టాన్ని దోచుకునే సాధనమే గుడిగా

గుడ్డి ఎడ్డి నమ్మకమె వాడి పెట్టుబడిగా


 భగవద్గిత, బైబిల్, ఖురాన్ లను పఠించిన

మతగురువులు,ఫాదర్, మొల్లాలు, బాబాలు

ఎముకలు కొరికే చలి నుండి

ప్రకృతి ప్రళయలా నుండి

వరదల నుండి, సునామి నుండి

కరువు కాటకాల నుండి

ఆకస్మిక మరణల నుండి

కరోన వైరస్ నుండి రక్షించలేక పోయారు


పురాణం కథలయిన

బైబిల్ కథలయిన

ఇస్లాం పరలోకపు కథలయిన

భక్తి పిచ్చిలో చేస్తున్న

వికార వికృత సాంస్కృతిక 

వేశాలైన చిత్త బ్రమల్లో 

బతికెల చేసే ద్యానమే

దేవుని దెయ్యం భావన


దాస్యం పోవాలంటే సంస్కృతిని

విడమరిచి చెప్పేవాళ్ళు రావాలి

ముర్కత్వం తుంచే మూలాలు వేదకాలి

అందవిశ్వాసం రూపుమాపాలంటే

ప్రభుత్వం మూఢ నమ్మకాలను

అరికట్టేందుకే చట్టాలు చెయ్యాలి

శాస్త్రీయ ధోరణి అలవర్చుకునే

పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశాలను చేర్చాలి

అక్షరాస్యతను పెంచాలి, హేతువాదిగా మారాలి 

మానవత్వమే మనిషి మతంగా గుర్తించి

ప్రపంచంతో ముందడుగు వెయ్యాలి



Rate this content
Log in

Similar telugu poem from Action